బీహార్ : ఇండియాకి , ఎన్డీయేకి చెమటలు పట్టిస్తోన్న పప్పు యాదవ్
భారతదేశంలో ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల ఫీవర్ ఆకాశాన్ని తాకింది. హ్యాట్రిక్ విజయం సాధించి మరోసారి కేంద్రంలో అధికారాన్ని అందుకోవాలని బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే భావిస్తుండగా.. ఈసారైనా పవర్ కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పావులు కదుపుతోంది. నరేంద్ర మోడీని గద్దె దించడమే లక్ష్యంగా విపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. దేశం మొత్తం ఎన్డీయే vs ఇండియా కూటమి అన్నట్లుగా హోరాహోరీ పోరు నడుస్తుండగా.. బీహార్‌లోని ఓ స్థానంలో మాత్రం స్వతంత్ర అభ్యర్ధి చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి.
రాష్ట్ర ఈశాన్య మూలలో నెలకొన్ని వున్న పూర్ణియా వార్తల్లో నిలిచింది. ఫణీశ్వర్ నాథ్ రేణు , హిరామన్ వంటి ప్రసిధ్ధి సాహిత్య ప్రియులు నడిచిన గడ్డగా ప్రసిద్ధి గాంచింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ ప్రధాన పార్టీలకు చెమటలు పట్టిస్తున్నారు. ఎన్డీయే అభ్యర్ధిగా జేడీయూ నేత సంతోష్ కుమార్ కుష్వాహా మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జేడీయూ నుంచి తప్పుకున్న బీమా భారతి ఆర్జేడీ నుంచి బరిలో దిగుతున్నారు. ఈ స్థానంలో పప్పు యాదవ్ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు.
Also Read : ఓటు ఫ్రమ్ హోమ్ : అర్హులెవరు, దరఖాస్తు ఎలా, ఓటు ఎలా వేయాలి..?
పప్పు యాదవ్ 1990వ దశకంలో మూడు సార్లు ఈ స్థానానికి ప్రాతినిథ్యం వహించారు. రెండు సార్లు ఇండిపెండెంట్‌గా, ఒకసారి సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై భారీ మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అయిన రంజిత్ రంజన్‌ని వివాహం చేసుకున్న పప్పు యాదవ్ ఇటీవలే తన జన్ అధికార్ పార్టీని హస్తం పార్టీలో విలీనం చేశారు. అయితే కాంగ్రెస్ పప్పు యాదవ్‌ని తన అభ్యర్ధిగా పోటీకి దింపేందుకు నిరాకరించింది. రాహుల్ గాంధీని ప్రధానిగా చేసేందుకు పోరాటం చేస్తున్నట్లు పప్పు యాదవ్ ప్రకటించినప్పటికీ కాంగ్రెస్ వైఖరి మాత్రం మారలేదు.
దీంతో పప్పు యాదవ్ ఇండిపెండెంట్‌గా తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. పట్టణంలో ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆయన నిర్ణయం ఎన్డీయే, ఇండియా కూటమిని రెచ్చగొట్టిందని విశ్లేషకులు అంటున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ ఇప్పటి వరకు ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు. రాహుల్ గాంధీ బీహార్‌లో ఇప్పటి వరకు నిర్వహించిన ఏకైక ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. భారతికి ఓటేయాలని అభ్యర్ధించారు.
Also Read : యూఏఈ : దుబాయ్‌లో వరదలా , ‘‘ క్లౌడ్ సీడింగ్ ’’ అంత పని చేసిందా ..?
పప్పు యాదవ్ గడిచిన ఏడాది కాలంగా యాక్టీవ్‌గా పనిచేస్తున్నారు. పూర్ణియాలో ప్రధాని మోడీ ప్రసంగించిన ర్యాలీని సీఎం నితీష్ కుమార్ దాటవేస్తున్న నేపథ్యంలో ఏ జేడీయూ అభ్యర్ధికైనా బీజేపీ ఓట్ల బదిలీ జరగడం లేదంటున్నారు. అదే సమయంలో పప్పు యాదవ్ చాకచక్యంగా సాధారణ వ్యక్తులతో కలిసిపోతున్నారు. పార్టీ తనకు టికెట్ ఇవ్వకుండా అవమానించిన విధానాన్ని వివరిస్తూ కన్నీటి పర్యంతమవుతున్నారు. పూర్ణియా మొత్తాన్ని మోటార్ సైకిల్‌పై చుట్టేస్తూ..సమాజంలోని అన్ని వర్గాల మద్ధతు తనకు వుందని చెబుతున్నారు. తద్వారా బీజేపీకి బేస్‌గా వున్న ముస్లిం - యాదవ్ వర్గాన్ని కలవరపెడుతున్నారు.
ఇంతలో అనూహ్యంగా.. ఆర్జేడీ నేతలు పూర్ణియాలో పోరాటాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్ని విషయాలను భారతి చేతిలో వుంచకూడదని నిర్ణయించారు. రూపౌలి అసెంబ్లీ స్థానానికి ప్రాతినిథ్యం వహించిన ఆమె.. ఈ జిల్లాలో బలమైన వర్గంగా వున్న గంగోట కులానికి చెందినవారు. భారతి నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ హాజరయ్యారు. దేశంలో, రాష్ట్రంలో ఆయన టార్గెట్ ఎన్డీయే అయినప్పటికీ.. పూర్ణియాలో మాత్రం పప్పు యాదవ్‌ను టార్గెట్ చేసేలా తేజస్వీ యాదవ్ ప్రసంగాలు కొనసాగాయి. కాషాయ పార్టీ నుంచి అరువు తెచ్చుకున్నవనరుల ద్వారా 2020 అసెంబ్లీ ఎన్నికలను నడిపిన బీజేపీ ఏజెంట్ అంటూ పప్పు యాదవ్‌పై ఆయన ఆరోపణలు గుప్పించారు.
Comments
Post a Comment